schedule Wednesday, August 26, 2026

మాజీ కేంద్ర మంత్రి వెంకటస్వామి సేవలు చిరస్మరణీయం

calendar_today October 6, 2024
person meenewstelugu
మాజీ కేంద్ర మంత్రి వెంకటస్వామి సేవలు చిరస్మరణీయం

మాజీ కేంద్ర మంత్రి వెంకటస్వామి సేవలు చిరస్మరణీయం 

- ఘనంగా 95వ, జయంతి వేడుకలు 

- పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన సామాజిక కార్యకర్త పిడిశెట్టి రాజు

  మీ:: న్యూస్.. సిద్దిపేట జిల్లా : సెప్టెంబర్05, (హుస్నాబాద్ భార్గవాపురం నియోజకవర్గం / కోహెడ మండలం ) కేంద్ర మాజీ కార్మిక మంత్రి, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ (ఏ ఐ సీసీ ) కార్యదర్శి గడ్డం వెంకటస్వామి 95వ, జయంతి వేడుకలు ప్రముఖ సామాజిక కార్యకర్త పిడిశెట్టి రాజు ఆధ్వర్యంలో కాక చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ప్రయివేట్ హాస్పిటల్ లోని రోగులకు పండ్లు, బ్రేడ్ పంపిణి చేశారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ...గుడిసెల వెంకటస్వామి (అక్టోబర్ 5, 1929 - డిసెంబరు 22, 2014) భారత పార్లమెంటు సభ్యుడు పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు.. ఇతడు భారత జాతీయ కాంగ్రెసు పార్టీకి చెందిన సీనియర్ నాయకులుగా పెద్దపల్లి లోక్ సభ సభ్యుడిగా కేంద్ర కార్మిక సంక్షేమ శాఖ మంత్రి గా అనేక బాధ్యతలు చేపట్టి తిరుగులేనీ, మచ్చ లేని మనిషి గా పేరు ప్రఖ్యతలు పొందారు. ఈకార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు పోతూ సుదర్శన్, అంబేద్కర్ సంఘం ప్రతినిధులు కొంకట దామోదర్, స్వామి తదితరులు పాల్గొన్నారు.మీ న్యూస్ ప్రతినిధి కే అశోక్