శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిచ్చిన దుర్గామాత పూజలు జరిపిన బిట్టు నాగేశ్వరరావు స్వాతి
calendar_today
October 7, 2024
person
meenewstelugu
శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిచ్చిన దుర్గామాత పూజలు జరిపిన బిట్టు నాగేశ్వరరావు స్వాతి
మీ:: న్యూస్.. పెన్ పహాడ్ అక్టోబర్ 6 :మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో కనకదుర్గ దేవాలయంలో శరన్న నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు 4వ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా ప్రత్యేక అలంకరణలో ఆదివారం భక్తులకు దర్శనమిచ్చారు కార్యక్రమంలో భాగంగా ధూపహాడ్ గ్రామములో దుర్గ భవాని ఆలయంలో దుర్గా భవాని ఉత్సవ విగ్రహానికి అర్చకులు, వేద పండితులు దువ్వేది శాస్త్రి దేవాలయ నిర్మాణ కర్త మాజీ సర్పంచ్ బిట్టు నాగేశ్వరరావు ధర్మపత్ని స్వాతి ప్రత్యేక పూజలు జరిపి అమ్మవారికి కుంకుమార్చన జరిపి ప్రత్యేక పూజలు నిర్వహించినారు ఈ కార్యక్రమంలో కీత సరోజనమ్మ, చెరుకుపల్లి ధనలక్ష్మి, సావిత్రమ్మ, మారం జ్యోతి, గోకని రాంబాయమ్మ, మల్లెపల్లి లింగమ్మ, రామినేని పుష్పమ్మ, ఎరకలి అన్నపూర్ణ, గోపగాని విజయలక్ష్మి, పబ్బతి శ్రీదేవి, నిమ్మల పావని, బిట్టు ధనమ్మ, మల్లేపల్లి సరోజినమ్మ, మసనం పద్మ, నాగమ్మ, పిన్నమనేని విజయలక్ష్మి, కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తులు పాల్గొన్నారు