దాసరి రామకృష్ణ సంతాప సభలో పల్లా వెంకటరెడ్డి వ్యాఖ్య
అమరవీరుల అసమాన త్యాగాలతో ఎర్రజెండా ఎరుపెక్కిందని సిపిఐ జాతీయ సమితి సభ్యులు మునుగోడు మాజీ శాసనసభ్యులు పల్లా వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు.
ఆదివారం నాడు గరిడేపల్లి మండలం కల్మలచెరువు గ్రామంలో జరిగిన దివంగత సిపిఐ నేత దాసరి రామకృష్ణ సంతాప సభకు ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడుతూ....
. తెలంగాణ రాష్ట్రంలో సీపీఐది ప్రత్యేక స్థానమని, నాటి తెలంగాణ సాయుధ పోరాట నుంచి ఇటీవల జరిగిన ప్రత్యేక తెలంగాణ పోరాటం కొరకు జరిగిన అన్ని ప్రజా పోరాటాలలో సిపిఐ పాల్గొన్నదని ప్రజా సమస్యల పరిష్కారమే కమ్యూనిస్టు పార్టీ లక్ష్యం అని, ఆ లక్ష్య సాధనలో ఎన్ని అవాంతరాలు ఏదైనా ఎదుర్కొంటూ ముందుకు సాగుతామని ఆయన అన్నారు టీవల తెలంగాణలో జరిగిన శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాలని, అందుకు సిపిఐ గా నిర్మాణాత్మక సహకారం అందిస్తామని అవసరమైతే ప్రజాఉద్యమం నిర్మించేందుకు వెనకాడ బోమని ఆయన తెలిపారు
సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్ మాట్లాడుతూ
గరిడేపల్లి మండల సిపిఐ పార్టీ నిర్మాణంలో దాసరి రామకృష్ణది క్రియాశీలక పాత్ర అని మండల సిపిఐ కార్యదర్శిగా కల్మలచెరువు సింగిల్ విండో చైర్మన్ గా రైతాంగానికి అండగా నిలిచారని ఆయన గుర్తు చేశారు సంతాప సభకు మండల సిపిఐ కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా జిల్లా సిపిఐ కార్యవర్గ సభ్యులు ధూళిపాళ ధనంజయ నాయుడు,, గుండు వెంకటేశ్వర్లు సిపిఐ నాయకులు కడియాల అప్పయ్య పందిరి నాగయ్య, యల్లబోయిన సింహాద్రి కత్తి శ్రీనివాసరెడ్డి, నంద్యాల రామిరెడ్డి అమరారపు పున్నయ్య సారెడ్డి పాపిరెడ్డి ఉప్పతల కోటమ్మ, చిలక రాజు శ్రీను అయినాపురం లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు