schedule Thursday, August 27, 2026

దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తులజా భవాని దేవాలయంలో జాగరణ ఉత్సవాలు

calendar_today October 7, 2024
person meenewstelugu
దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తులజా భవాని దేవాలయంలో జాగరణ ఉత్సవాలు

దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తులజా భవాని దేవాలయంలో జాగరణ ఉత్సవాలు

   మీ:: న్యూస్ అక్టోబర్ 7... దేవి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని లక్ష్మి థియేటర్ వద్ద గల తులజా భవాని అమ్మ వారి గుడి లో అమ్మ వారి జాగరణ ఉత్సవాలు రాజపుత్ మహిళా కమిటీ ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరిగాయి...ఇట్టి కార్యక్రమంలో రాజపుత్ మహిళా కమిటీ అధ్యక్షురాలు నిఖిత ఠాకూర్(అనిత ఠాకూర్ )మాట్లాడుతూ ప్రతియేట అమ్మవారి జాగరణ ఉత్సవాలను మరియు బతుకమ్మ సంబరాలాను ఈ మందిరంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నామని ఈ సందర్బంలో భక్తులు అమ్మవారి భజనలు,కీర్తనలు పాడుతూ దాండియా నృత్యాలు చేస్తూ అమ్మవారిని కొలవడం జరుగుతుందని తెలుపడం జరిగినది. ఈ సందర్బంగా మాట్లాడుతూ తులజాభవాని మందిరం యొక్క భావసాగర్ క్షత్రియ సమాజ్ ట్రస్ట్ నిర్వాహకులు అశోల్ తండల్ గారు అధ్యక్షా కార్యదర్శులు బాలకిషన్ బాసూత్కర్ మరియు దిలీప్ భగీర్ గారు తగిన ఏర్పాట్లు చేసి భోజన సౌకర్యాలు కలించినందుకు రాజపుత్ మహిళా కమిట ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజపుత్ మహిళా కమిటీ ప్రధానకార్యదర్శి పల్లవి, కవిత, సుమన్, నీత, అర్చన, అశ్విని,శిరీష, గాయత్రి,పద్మిని, ఆర్తి, సునీత, తులజా, తనూజా, శారద,జాగ్రతి తార, మున్ని, నేహా, సరళ, నవిత, స్వాతి, జయశ్రీ, వనిత, ప్రియాంక, విజయలక్ష్మి,శోభా,సునీత, స్వప్న,సంధ్య,తదితరులు పాల్గొనడం జరిగింది