వెంటనే పెండింగ్ వేతనాలు జీతాలు విడుదల విడుదల చేయాలని కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు
calendar_today
October 7, 2024
person
meenewstelugu
వెంటనే పెండింగ్ వేతనాలు జీతాలు విడుదల విడుదల చేయాలని కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు
మీ:: న్యూస్ అక్టోబర్ 7... తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు సూర్యాపేట కలెక్టర్ గారి కార్యాలయంలో కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది సమర్పించి జిల్లా అధ్యక్షులు ధనియాకుల శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులు పండగ పూట పస్తులు ఉండాలా లేక పండగ సంతోషంగా జరుపుకోవాలని అంటే మీరు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి అని వారు తెలపడం జరిగింది అదేవిధంగా మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని కార్మికులకి కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా ఇంకా గ్రామపంచాయతీ కార్మికులు ఎన్ని రోజులకి పర్మినెంట్ కి నోచుకుంటారని వారు డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాధాకృష్ణ జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మాది వెంకటేశ్వర్లు గ్రామపంచాయతీ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చిట్యాల రవిచంద్ర మరియు అన్ని మండలాల అధ్యక్షులు మరియు గ్రామపంచాయతీ కార్మికులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు