schedule Wednesday, August 26, 2026

మునగాలలో తక్షణమే వీధిలైట్లు ఏర్పాటు చేయాలి

calendar_today October 8, 2024
person meenewstelugu
మునగాలలో తక్షణమే వీధిలైట్లు ఏర్పాటు చేయాలి

మునగాలలో తక్షణమే వీధిలైట్లు ఏర్పాటు చేయాలి

 మీ:: న్యూస్ అక్టోబర్ 7 : మునగాల మండల కేంద్రంలో తక్షణమే వీధిలైట్లు ఏర్పాటు చేయించాలని ఈరోజు నేను గ్రీవెన్స్ డే లో తాసిల్దార్ మరియు మునగాల గ్రామ ప్రత్యేక అధికారి ఆంజనేయులు గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది.గత కొన్ని నెలల నుంచి వీధిలైట్లు వెలగక పోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో కుక్కలు స్వైర విహారం చేస్తూ ఉండటంతో చీకట్లో ప్రజల మీదకు ఎగబడుతు కరుస్తూ ఉన్నాయి. మరో రెండు మూడు రోజుల్లో గ్రామంలో శ్రీ కనకదుర్గమ్మ జాతర ఉన్నందున ప్రభ బండ్లు, అమ్మవారు ఇంటింటికి వచ్చి పసుపు, కుంకుమలు స్వీకరించే కార్యక్రమం ఉన్నందున ఆ తర్వాత దసరా, దీపావళి పండుగలు ఉన్నందున తక్షణమే వీధిలైట్లు ఏర్పాటు చేయించాలని వినతి పత్రం అందజేయడం జరిగింది.