schedule Wednesday, August 26, 2026

నయానగర్ లో ఘనంగా దేవి నవరాత్రులు...

calendar_today October 9, 2024
person meenewstelugu
నయానగర్ లో ఘనంగా దేవి నవరాత్రులు...

నయానగర్ లో ఘనంగా దేవి నవరాత్రులు...

 

శ్రీ మహాలక్ష్మి దేవిగా దర్శనం ఇచ్చిన అమ్మవారు

   

   మీ:: న్యూస్ అక్టోబర్ 8          సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని నయా నగర్ మదర్ తెరిసా స్కూల్ సమీపాన దేవీ నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నారు. ఆరవ రోజు అమ్మవారు భక్తులకు శ్రీ మహాలక్ష్మి దేవి రూపంలో దర్శనం ఇచ్చారు.వేద పండితులు, భక్తులు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి పూజలు నిర్వహించారు.అనంతరం భక్తులకు అన్నదానం తీర్థ,ప్రసాదాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో నయా నగర్ దేవి నవరాత్రుల ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.......