schedule Wednesday, August 26, 2026

గ్రామస్తుల ఫిర్యాదు మేరకు డిపివో విచారణ

calendar_today October 10, 2024
person meenewstelugu
గ్రామస్తుల ఫిర్యాదు మేరకు డిపివో విచారణ

గ్రామస్తుల ఫిర్యాదు మేరకు డిపివో విచారణ

మీ::న్యూస్... మోతె : గత సర్పంచ్ పాలనలో గ్రామపంచాయతీలో అక్రమాలు జరిగాయని గ్రామస్తులు కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో బుధవారం మండల పరిధిలోని నామవరం గ్రామంలో డిపివో నారాయణరెడ్డి విచారణ చేపట్టారు. 2019 - 24 సర్పంచ్ పదవి కాలంలో అక్రమాలు జరిగాయని, దానిపై విచారణ చేపట్టాలని గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు, దీంతో అధికారులు గ్రామపంచాయతీలో వార్డ్ మెంబర్లను పిలిచి వివరాలు తీసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. విచారణ అనంతరం నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని డిపివో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఆంజనేయులు, కార్యదర్శి మౌనిక, శ్రావణ్ కుమార్ తదితరులు ఉన్నారు.