schedule Wednesday, August 26, 2026

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన 

calendar_today October 11, 2024
person meenewstelugu
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన 

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన 

- భారతరాష్ట్ర సమితి పార్టీ (బీ ఆర్ ఎస్) ఎమ్మెల్సీ ఆశవాహ అభ్యర్థి పిడిశెట్టి రాజు 

  • సిద్దిపేట జిల్లా : మీ:: న్యూస్ అక్టోబర్11, (హుస్నాబాద్ భార్గవాపురం నియోజకవర్గం / కోహెడ మండలం ) స్వస్తి శ్రీ కోధి నామ సంవత్సరం, దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గం(భార్గవాపురం)లోని పలు మండపాలను సందర్శించారు. అందులో భాగంగా వెంకటేశ్వర్ల పల్లి,కోహెడ మండల కేంద్రంలో దుర్గా మాత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన కరీంనగర్ - ఆదిలాబాద్ - నిజామాబాద్ - మెదక్ పట్టభద్రుల నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి (బీ. ఆర్.ఎస్) పార్టీ ఆశవాహ ఎమ్మెల్సీ అభ్యర్థి పిడిశెట్టి రాజు... ఈసందర్బంగా వారు మాట్లాడుతూ శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా హిమవర్థిని దేవిగా దర్శనమిస్తున్న దుర్గామాత అమ్మవారు, చెడును నాశనం చేసి గ్రహపీడలు తొలగించే ఆ హిమర్థిని దేవి అనుగ్రహం, ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, రాష్ట్రంలో పాడిపంటలు సమృద్ధిగా పండాలని , తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరియు హుస్నాబాద్ భార్గవాపురం నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని, రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి వ్యవస్థపాక అధ్యక్షులు, మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో పార్టీ టికెట్ తమకు ఇచ్చే అవకాశం ఇవ్వాలని శ్రీ కనుక దుర్గా అమ్మవారిని వేడుకున్నారు.ఈకార్యక్రమంలో కోహెడ గ్రామపంచాయతీ మాజీ వార్డు సభ్యులు నరాల శ్రీకాంత్ నేత, డీ జే ప్రసాద్,గోరీత్యాల శ్రీనివాస్,వెంకటేశ్వర్లపల్లి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.మీ 31న్యూస్ ప్రతినిధి కే అశోక్