schedule Saturday, August 22, 2026

దాడి చేసింది  చిరుత పులి 

calendar_today October 16, 2024
person meenewstelugu
దాడి చేసింది  చిరుత పులి 

దాడి చేసింది  చిరుత పులి 

 ఎద్దుపై దాడితో నిర్దారణ

 పూర్తి నిర్ధారణ కోసం పులి ముద్రలకు జంతు పరీక్ష కేంద్రానికి తరలింపు 

 సమీప ప్రజలు జాగ్రత్తగా ఉండాలి

అటవీ, పోలీసు అధికారుల సూచన

 అటవీ ప్రాంతాన్ని పరిశీలించిన రేంజ్ అధికారి రాజేందర్ 

  మీ:: న్యూస్ అక్టోబర్ 16...                  వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని యాలాల మండలం రేళ్లగడ్డ తాండాలోపులి సంచారం జరుగుతున్నట్లు అటవీ శాఖ అధికారులు నిర్ధారణ వచ్చారు బుధవారం యాలాల మండలం రేళ్లగడ్డ తాండాలో ఎద్దు పై దాడి జరిగిన సంఘటనతో అధికారులు అప్రమత్తమై సంఘటన స్థలానికి చేరుకున్నారు తాండాకు చెందిన మూడావత్‌ గోప్యా నాయక్ పొలంలో ఉన్న ఎద్దుపై దాడి చేయడంతో అది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన పై మండలంలో అటవీ శాఖ రేంజ్ అధికారి రాజేందర్, బిట్ ఆఫీసర్ కాశయ్య బృందం , యాలాల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. డీఎఫ్‌ఓ పొలంలో ఉన్న జంతువు పాద ముద్రలను పరిశీలించి చిరుతపులికి చెందినవిగా గుర్తించారు.ఎద్దుపై దాడి చేసింది చిన్న చిరుతపులిగా నిర్దారించారు. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారి రాజేందర్ మాట్లాడుతూ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించడం జరిగిందని ఇక్కడ పాద ముద్రల ఆధారంగా చిన్న చిరుతపులి గా నిర్ధారణకు వచ్చినట్లుగా తెలిపారు అదేవిధంగా ఈ పాద ముద్రలను అటవీ శాఖ వైద్యశాలకు పంపించడం జరిగిందని తెలిపారు అదేవిధంగా బాధిత రైతుకు ప్రభుత్వ తరఫున సహాయం అందజేస్తామని తెలిపారు.అలాగే సమీప ప్రాంత ప్రజలకు జాగ్రత్తలు సూచించారు. ప్రజలెవ్వరు ఒంటరిగా అడవి వైపు వెళ్లొద్దని తెలిపారు. పశువులు, మేకలును పొలాల వద్ద, బావుల వద్ద కట్టేసి ఉంచారాదన్నారు. మహిళలు, పురుషులు, చిన్నారులు తెల్లవారు జాము సమయంలో బహిర్భూమికి చెట్ల పొదల్లోకి వెళ్లరాదని సూచించారు. చీకటి పడిన తరువాత ఇంటి నుంచి బయటకు రావద్దని, ఇంట్లోనే ఉండాలని సూచించారు.