schedule Sunday, August 23, 2026

యువతకు స్ఫూర్తి ఛత్రపతి శివాజీ

calendar_today February 19, 2024
person meenewstelugu
యువతకు స్ఫూర్తి ఛత్రపతి శివాజీ

యువతకు స్ఫూర్తి ఛత్రపతి శివాజీ - పలు గ్రామాలలో శివాజీ విగ్రహాలను ఆవిష్కరించిన పైలెట్ - అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే - పైలేట్ కు ఘన స్వాగతం పలికిన యువజన సంఘాలు

దీక్షతెలుగున్యూస్, తాండూరు :
ఛత్రపతి శివాజీని నేటితరం యువత స్ఫూర్తిగా తీసుకుని ముందుకుసాగాలని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. శివాజీ జయంతి సందర్భంగా యాలాల మండలం చెన్నారం,అన్నాసాగర్ గ్రామాల్లో శివాజీ మహరాజ్ విగ్రహాలను పైలెట్ రోహిత్ రెడ్డి ఆవిష్కరించి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి మాట్లాడుతూ..భావి తరాలకు మహనీయుల చరిత్ర తెలియజేయాలన్న సమన్నత లక్ష్యంతో నియోజకవర్గ పరిధిలో విగ్రహాలను ఏర్పాటు చేశామన్నారు.కుల మతాలకు అతీతంగా ప్రజలకు నిస్వార్థ సేవలను అందించిన మహనీయుడు ఛత్రపతి, శివాజీ మహరాజ్ పరిపాలన, విధానాలు వ్యక్తిత్వం నేటితరం ఆదర్శంగా తీసుకోవాలని పైలెట్ పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ విఠల్ నాయక్, వెంకట్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, సీనియర్ నాయకులు ఆశన్న, సిద్రాల శ్రీనివాస్, మధుసూధన్ రెడ్డి, వైస్ ఎంపీపీ రమేష్, సర్పంచులు లక్ష్మినారాయణ, సాయిలు, ఎంపిటిసి ప్రభాకర్, నాయకులు నారాయణ, శివ కుమార్, సాయిలు, వెంకటయ్య, వెంకట్ రెడ్డి, రవి, అరవింద్ రెడ్డి, కృష్ణ, శేకర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, శ్యామ్, మహేష్ రెడ్డి, రఘు, విక్రాంత తదితరులున్నారు.