అభివృద్ధి ప్రధాత పేరూరి సత్యనారాయణ మరణం గ్రామానికి తీరని లోటు
calendar_today
October 21, 2024
person
meenewstelugu
అభివృద్ధి ప్రధాత పేరూరి సత్యనారాయణ మరణం గ్రామానికి తీరని లోటు
మీ:: న్యూస్ ప్రతినిధి అక్టోబర్ 20:: గరిడేపల్లి మండలం గానుగబండ గ్రామ అభివృద్ధికి దాత గా అనేక రకాలుగా సహాయం చేసిన పేరూరి సత్యనారాయణ మరణం గ్రామానికి తీరని లోటు అని సిపిఐ మండల కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు అన్నారు.ఈ రోజు మరణించిన పేరూరి సత్యనారాయణ భౌతిక కాయానికి గ్రామ ప్రజలు కన్నీటి తో ఘనంగా నివాళులు అర్పించినారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ,గ్రామం లో జరిగిన ప్రతి అభివృద్ధి లో ఆయన పాత్ర వున్నదని, గ్రామం లో మంచినీటి ట్యాంక్ నిర్మాణం కొరకు స్థలం ఇచ్చినాడని, హాస్పటల్ నిర్మాణం కొరకు స్థలం, హరిజన వాడలో బడి నిర్మాణం కొరకు స్థలం ఇచ్చినాడని, స్కూల్స్ లో జాతీయ నాయకులు మహాత్మాగాంధీ, నెహ్రు విగ్రహాలు వేయించినాడని, గ్రామం లో బొడ్రాయి, ధ్వజ స్తంభంలను 20 లక్షల రూపాయలు తన స్వంతం గా ఖర్చు పెట్టి వేయించినాడని, గ్రామ రామాలయం లో దూప దీప నైవేద్యం ల కొరకు రెండు ఎకరాల భూమిని దాతగా ఇచ్చినాడని, గ్రామం లో జరిగిన ప్రతి అభివృద్ధి కి తన వంతుగా ప్రతి దానికి సహాయం చేసి దాత గా పేరు ఘడించినా ఆయన మరణాన్ని గ్రామ ప్రజలు జీర్ణించుకోలేక పోవుచున్నారని ఆయన అన్నారు.ఆయన తెలంగాణ సాయుధ పోరాట యోధులు, సీనియర్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు పాల్వాయి రామ కోటేశ్వరరావు శిష్యుడు గా నాటి నుండి నేటి వరకు 50 సంవత్సరాలు గా సిపిఐ పార్టీ సభ్యులు గా కొనసాగుచు పార్టీ కి సేవ చేసినాడని, వారి సేవలను గుర్తు చేసుకుంటూ, సిపిఐ గ్రామ మండల కమిటీలు విప్లవ జోహార్లు అర్పించారు.గ్రామ ప్రజలు పనులన్నీటిని బంద్ పెట్టుకొని అంత్యక్రియలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం లో కడియాల అప్పయ్య, గోధుమల మల్లచారీ, ఈద సైదులు, పంగ గోవిందు, గుర్రం జయమ్మ, చింతకాయల శ్రీను, కీసర చిన్న వెంకయ్య, నందిపాటి సైదులు టీచర్, జొన్నలగడ్డ తిరపయ్య, వారి కుటుంబ సభ్యులు, బందు మిత్రులు, గ్రామ ప్రజలందరూ పాల్గొన్నారు.