schedule Wednesday, August 26, 2026

రైతులకి రైతు భరోసా అందించి సహాయం చేయాలి గ్రామీణ పేదల సంఘం డిమాండ్ చేస్తుంది

calendar_today October 21, 2024
person meenewstelugu
రైతులకి రైతు భరోసా అందించి సహాయం చేయాలి గ్రామీణ పేదల సంఘం డిమాండ్ చేస్తుంది

రైతులకి రైతు భరోసా అందించి సహాయం చేయాలి గ్రామీణ పేదల సంఘం డిమాండ్ చేస్తుంది

 మీ::న్యూస్ ప్రతినిధి అక్టోబర్ 20: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చి పది నెలలు గడుస్తున్న వారు చేసిన 6 గ్యారంటీలో అమలులో భాగంగా తెలంగాణ రైతులకి రైతు భరోసాఅందిస్తామని అదే విధంగా రైతులకి రెండు లక్షల రుణమాఫీ చెప్పినారు.అదేవిధంగా అరకురా రుణమాఫీ చేసి చేతులు దులుపుకుంటున్నారు ఇంకా రెండు లక్షల మందికి రుణమాఫీ జరగలేదు రుణమాఫీ పేరుతో రైతుబంధును రైతు భరోసాగా మార్చి రైతులకు 7500 ఇస్తానని ఇప్పుడు ఇవ్వకుండా ఇబ్బంది చేస్తున్నారు కాలయాపన చేసుకుంటూ రైతులకు అందవలసిన సహాయం ఇవ్వడం లేదు.ప్రభుత్వం ప్రభుత్వం తక్షణమే రైతు భరోసా అందించాలని జిల్లా కార్యదర్శి కొనకంచి వీరభద్రయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ పేదల సంఘం జిల్లా కార్యదర్శి కొనకంచి వీరభద్రయ్య ప్రజాతంత్ర విద్యార్థి సంస్థ జిల్లా కార్యదర్శి భాషిపంగు సునీల్ గ్రామీణ పేదల సంఘం నాయకుడు అనంతల ఎల్లయ్య రైతులు భూక్యా వెంకన్న. బుద్ధ ప్రసాద్ కొనకంచి అంజయ్య గుడ్ లోతు వెంకన్న కొనకంచి కళావతి గూగులోత్ మంగమ్మ భూక్య దేవిలి పాల్గొన్నారు