schedule Wednesday, August 26, 2026

ఈనెల 24న జిల్లా గవర్నర్ సూర్యాపేటలో పర్యటన కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలి

calendar_today October 23, 2024
person meenewstelugu
ఈనెల 24న జిల్లా గవర్నర్ సూర్యాపేటలో పర్యటన కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలి

ఈనెల 24న జిల్లా గవర్నర్ సూర్యాపేటలో పర్యటన కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలి

     

 మీ న్యూస్ ప్రతినిధి అక్టోబర్ 23::తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ తెలిపారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 24 న ఉదయం 10 గంటలకు రాష్ట్ర గవర్నర్ పర్యటన ఉన్నందున అధికారులు తమ శాఖలకు సంబంధించిన పూర్తి వివరాలను 🫥 చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. జిల్లా లో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల వివరాలను పిపిటి ద్వారా గవర్నర్ కు వివరించాలని కలెక్టర్ తెలిపారు. గవర్నర్ తిలకించుటకు ఐదు స్టాళ్లను ఏర్పాటు చేసి సిద్ధంగా ఉంచాలన్నారు. ఉదయం 10:30 గంటల నుండి 11:30 గంటల వరకు జిల్లా అధికారులతో పరిచయ కార్యక్రమం ఉంటుందని ఆ తరువాత శాఖల వారీగా తమ లక్ష్యాలను గవర్నర్ కు వివరించాల్సి ఉంటుందని అందరూ అధికారులు సిద్ధంగా ఉండాలని తెలిపారు. జిల్లాకు చెందిన వివిధ కళాకారులు కవులతో పరిచయ కార్యక్రమం ఉంటుందని దానికి తగ్గ ఏర్పాట్లు చేయాల్సిందిగా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ వి అప్పారావు డిఇఓ అశోక్ భీమన్న,కోటాచలం సివిల్ సప్లై అధికారి డి రాజేశ్వర్ , సుదర్శన్ రెడ్డి, డిపిఓ నారాయణరెడ్డి అసిస్టెంట్ కమిషనర్ లేబర్ జి నారాయణస్వామి డిడబ్ల్యువో కె నరసింహారావు ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ లత డి జి డి వో శంకర్ 

 పంచాయతీ రాజ్ కే మాధవి మిషన్ భగీరథ అధికారులు శ్రీనివాస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.