పురపాలక బడ్జెట్ అంచనా రూ.65.39 కోట్ల
February 19, 2024
meenewstelugu
పురపాలక బడ్జెట్ అంచనా రూ.65.39 కోట్ల
- వార్షిక బడ్జెట్ కు కౌన్సిల్ ఆమోదం
- ఎమ్మెల్యే నిధులు పార్టీలకు అతీతంగా సమానం
- రాజకీయాలు పక్కన పెట్టి ప్రజాసేవ కోసం అంకితం అవ్వాలి
- గత ప్రభుత్వం జీవోలకే పరిమితం
- తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
దీక్షతెలుగున్యూస్ ,తాండూరు :
తాండూరు మున్సిపాలిటీ 2024-2025 ఆర్థిక సంవత్సరానికి 65.39 కోట్ల అంచనాతో రూపొందించిన బడ్జెట్ కు కౌన్సిల్ ఆమోదం తెలిపింది.మున్సిపల్ సర్వసాధారణ బడ్జెట్ సమావేశం మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న అధ్యక్షతన ప్రశాంతంగా ముగిసింది. ఇట్టి సమావేశానికి తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఇట్టి సమావేశంలో తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్ కు కౌన్సిలర్లు అందరూ కూడ రాజకీయాలకు అతీతంగా ఆమోదం తెలపడంతో హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ .. ప్రస్తుతం ప్రవేశ పెట్టిన మున్సిపల్ ఆర్థిక2024-25 అంచనా సాధారణ ఆధాయం రూ.25.64 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. అదేవిధంగా అంచనా వ్యయం బడ్జెట్ కింద రూ.65.39 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశ పెట్టగా కౌన్సిలర్లందరు ఆమోదించడం జరిగిందన్నారు.36 వార్డుల్లో అద్భుతమైన అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రజలు మనపై నమ్మకంతో ప్రజా ప్రతినిధిగా ఎన్నుకున్నారు వారి మాటలు నిలబెట్టేందుకు అందరూ కలిసికట్టుగా పని చేస్తేనే వార్డులు అభివృద్ధిలో నిలపగలుగుతామని కౌన్సిలర్లకు సూచించారు.పట్టణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి :ఎమ్మెల్యే
పట్టణం అనే రంగంలో అభివృద్ధి చేసేందుకు అందరి సహకారంతో ముందుకెళ్తున్నట్లు తెలిపారు. మున్సిపల్ కు ఎమ్మెల్యే నిధుల ద్వారా 4 కోట్ల నిధులను విడుదల చేయడం జరిగిందన్నారు.36 మంది కౌంటర్లకు ఒక్కొక్కవార్డుఅభివృద్ధి
పనులకోసం10లక్షలనిధులనుకేటాయించామన్నారు. మిగతా 40 లక్షలు ఏ వార్డుకైనా అభివృద్ధి కోసం అవసరమైతే చైర్మన్ చూసుకుంటారని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లాడాలని చెప్పారు. ఉన్న వాటిని దశలవారీగా పరిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.