schedule Wednesday, August 26, 2026

ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యులుగాఎన్నిక

calendar_today October 25, 2024
person meenewstelugu
ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యులుగాఎన్నిక

ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యులుగాఎన్నిక

 మీ న్యూస్ ప్రతినిధి అక్టోబర్ 24::సూర్యాపేట టౌన్ : అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం( ఐద్వా ) రాష్ట్ర మహాసభలు అక్టోబర్21,22,23 తేదీలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరిగాయి.సూర్యాపేట జిల్లా నుండి ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న మద్దెల జ్యోతి,జిల్లా కోశాధికారిగా పనిచేస్తున్న మేకన బోయిన సైదమ్మ, జిల్లా సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్న జూలకంటి విజయలక్ష్మి లను రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.సందర్భంగాజ్యోతి,సైదమ్మ,విజయలక్ష్మిమాట్లాడుతూ ఐద్వాను బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు.