schedule Tuesday, August 25, 2026

అన్నారుగూడెం నుంచి కరక్కాయలగూడెం రోడ్డుకు మహర్దశ.. ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి

calendar_today October 25, 2024
person meenewstelugu
అన్నారుగూడెం నుంచి కరక్కాయలగూడెం రోడ్డుకు మహర్దశ.. ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి

అన్నారుగూడెం నుంచి కరక్కాయలగూడెం రోడ్డుకు మహర్దశ.. ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి

   

 మీ న్యూస్ ప్రతినిధి అక్టోబర్ 24 

సూర్యాపేట జిల్లా మోతే మండల పరిధిలోని అన్నారు గూడెం మర్రిచెట్టు నుంచి కరక్కాయల గూడెం వెళ్లే రహదారి బీటి రోడ్డుగా మారనుంది. ఈ రహదారి గుంతల మయంగా ఉండడంతో గ్రామస్తులు, మండల నాయకులు ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి దృష్టికి తీసుకెళ్లగా, ఎమ్మెల్యే, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి తెలపగా బీటీ రోడ్డు వేసేందుకు 2.30 లక్షలు నిధులు మంజూరు చేశారు. ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే నరకం చూసామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా బీటీ కి నోచుకోని గుంతల రోడ్డు నిధుల మంజూరు తో బీటీ రోడ్డుగా మారనుంది. దీనితో గ్రామస్తుల కష్టాలు తీరనున్నాయి. గతంలో అధికారులకు, ప్రజా పతినిధులకు తెలిపిన ఎవరు పట్టించుకోలేదన్నారు. రహదారి నిర్మాణానికి ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిధులు మంజూరు చేయడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.