schedule Wednesday, August 26, 2026

అధిక ధరలను వెంటనే తగ్గించాలి.

calendar_today October 26, 2024
person meenewstelugu
అధిక ధరలను వెంటనే తగ్గించాలి.

అధిక ధరలను వెంటనే తగ్గించాలి.

 కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి

 కేరళ తరహాలో రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యవసర వస్తువులు పంపిణీ చేయాలి

 మోతే తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నాలో

 సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు

  మీ న్యూస్ ప్రతినిధి అక్టోబర్ 26 ::: మోతే:దేశవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని సిపిఎం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు డిమాండ్ చేశారు. శనివారం సిపిఎం కేంద్ర కమిటీ పిలుపు మేరకు మోతే తాసిల్దార్ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగాఆయనమాట్లాడుతూ దేశంలో నిత్యవసర సరుకుల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయని, వాటిని నియంత్రించడంలో బిజెపి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. 2024 ఎన్నికలలో అచ్చద్దిన్ పేరుతో దేశంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు కావస్తున్నా నాటి నుండి నేటి వరకు దేశవ్యాప్తంగా అన్ని రకాల నిత్యవసర వస్తువుల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయని. పెరుగుతున్న ధరలను అరికట్టేందుకు చర్యలు చేపట్టడంలో కేంద్ర బిజెపి ప్రభుత్వం పూర్తిగా వైఫైల్యం చెందిందని విమర్శించారు.పెరిగిన ధరలతో పేద, మధ్యతరగతి ప్రజలు,కార్మికులు,వ్యవసాయ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ సంపదను మాత్రం పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు కట్ట పెడుతున్నారని విమర్శించారు. బిజెపిఅధికారాన్ని అడ్డుపెట్టుకొని కార్పొరేట్ శక్తులు ప్రజల సంపదను లూటీ చేస్తున్నారనిఅన్నారు. ధరల భారం ప్రజలపై పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రభుత్వ ఆహార సంస్థలలో మూలుగుతున్న బియ్యం, గోధుమలు తదితర నిత్యవసర వస్తువులను పేదలకు ఉచితంగా పంపిణీ చేయాలన్నారు. ధరలు పెంచేందుకు బడాబాబులు బ్లాక్ మార్కెట్ల లో నిలువ ఉంచిన నిత్యవసర వస్తువులను వెలికి తీసి పేదలకు ఇవ్వాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని డిమాండ్ చేశారు. కేరళ సిపిఎం ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యవసర వస్తువులను ప్రజలకు అందిస్తుందని దేశవ్యాప్తంగా ఈ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలనికోరారు.