schedule Saturday, August 22, 2026

102 వాహనం బాలింతలకు వరం

calendar_today October 27, 2024
person meenewstelugu
102 వాహనం బాలింతలకు వరం

102 వాహనం బాలింతలకు వరం

అమ్మకు ఆత్మీయతతో బిడ్డకు ప్రేమతో...

(మీ న్యూస్ జహీరాబాద్)::102 వాహనం బాలింతలకు వరం అమ్మకు ఆత్మీయతతో బిడ్డకు ప్రేమతో... అనే నిదాదంతో ప్రారంభించినటువంటి 102 వాహనం బాలింతల పాలిట వరంల కల్పించిన గత ప్రభుత్వం ఎంతోమంది బాలింతలకు రవాణా సౌకర్యానికి ఉపయోగించుకుంటున్నారు. 102 వాహనంలో పైసా ఖర్చు లేకుండా ఉచితంగా సేవ చేస్తూ బాలింతలను ప్రతిరోజు వారి వారి గ్రామాలకు వెళ్లి తీసుకొని వచ్చి హాస్పిటల్లో చెకప్ చేపిచ్చి మళ్ళీ తిరిగి వారి గమ్యాలకు చేరుస్తు 102 బాలింతలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రైవేటు వాహనాలు ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోతున్న పేదలకి వరంలా సమకూర్చిన 102 వాహనాలు గర్భిణీ స్త్రీలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ప్రసవ అనంతరం తల్లి బిడ్డలను వారి ఇంటికి తీసుకెళ్లడానికి ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి డబ్బులు పెట్టుకోలేని పేదలకు ఎంతగానో ఉపయోగించుకొంటున్నారు. గర్భం దాల్చిన మొదటి నెల నుండి వారి గ్రామాలలో ఉన్నటువంటి ఆశ కార్యకర్త ల ద్వారా జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చి రక్త పరీక్షలు చెకప్ లు చేపించి మరియు వారి వారి గ్రామాలలో వదిలిపెట్టడం జరుగుతుంది. ఇంకా ఎక్కువగా 102సేవలను ఉపయోగించుకోవాలని డాక్టర్లు కోరుతున్నారు. ఈ సందర్బంగా పైలెట్ దేవయ్య ఎం చంద్రకాంత్ లను డాక్టర్లు అభినందిస్తున్నారు.