మీ న్యూస్ ప్రతినిధి::సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సీనియర్ న్యాయవాది బత్తిని వెంకటేశ్వర్లు నాగలక్ష్మి దంపతుల కుమార్తె బత్తిని జోషిత పుట్టినరోజు సందర్భంగా ఆదివారం కాసరబాద క్రాస్ రోడ్డు నందు గల అపూర్వ దివ్యాంగుల పాఠశాలలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ చిన్నారి జోషిత పుట్టిన రోజు వేడుకలను అపూర్వ దివ్యాంగులు పాఠశాలలో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, విద్యార్థులు పాల్గొన్నారు.