schedule Tuesday, August 25, 2026

మాజీ సర్పంచులు అరెస్టు 

calendar_today November 5, 2024
person meenewstelugu
మాజీ సర్పంచులు అరెస్టు 

మాజీ సర్పంచులు అరెస్టు 

మాజి సర్పంచ్ లను ఎక్కడికక్కడ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ కు తరలింపు.

 మీ న్యూస్ ప్రతినిధి:: సర్పంచ్ ల పెండింగ్ బిల్లులను చెల్లించాలని రాష్ట్ర సర్పంచ్ ల జేఏసీ పిలుపుమేరకు చలో హైదరాబాద్ పోరు బాటకు బయలుదేరుతున్న జహీరాబాద్ మండల తాజా మాజి సర్పంచ్ లను ఎక్కడికక్కడ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు.అరెస్ట్ అయిన వారిలో న్యాల్కల్ మండల్ సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షులు రవి కుమార్ ప్రధాన కార్యదర్శి జట్గొండ మారుతి ,తదితరులుఉన్నారు..ఈ సంధర్బంగా మాట్లాడుతూ గ్రామంలో గ్రామ ప్రథమ పౌరులుగా ఉన్న సర్పంచ్ లను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం తగదని, పెండింగ్ లో ఉన్న సర్పంచుల బిల్లులను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు....