మీ న్యూస్ ప్రతినిధి::ఇంటర్ కళాశాలల విద్యార్థులు చదువులో రాణించాలని, జిల్లా ఇంటర్ కళాశాలల విద్యాధికారి భాను నాయక్ అన్నారు. మంగళవారం సూర్యాపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులతో ప్రేర్ లో పాల్గొన్నారు.కళాశాల ప్రిన్సిపాల్ పెరుమాళ్ళ యాదయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో, ఆయన మాట్లాడుతూ... విద్యార్థులు ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని సూచించారు. కళాశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయులు స్టడీ ఓవర్లు పెంచాలన్నారు. జిల్లాలో ప్రభుత్వ కళాశాల విద్యార్థులు అత్యధిక ఉత్తీర్ణత సాధించాలని, దీనికి ఉపాధ్యాయులు, విద్యార్థులకు అర్థమయ్యే విధంగా బోధించాలన్నారు.విద్యార్థులు 75 హాజరు శాతం ఉండాలన్నారు. విద్యార్థులు కష్టపడి చదవాలని,చెడు అలవాట్లకు బానిస కాకుండా ఉండాలన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.