schedule Wednesday, August 26, 2026

నిర్మాణరంగ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం.

calendar_today November 6, 2024
person meenewstelugu
నిర్మాణరంగ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం.

నిర్మాణరంగ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం.

 మీ న్యూస్ ప్రతినిధి :: కలెక్టర్ కార్యాలయం సూర్యాపేట.§నిర్మాణరంగ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం. జిల్లాలో సంవత్సరాలకు తరబడి ఉంటున్న వెల్ఫేర్ బోర్డు పెండింగ్ క్లైములను పరిష్కరించడంలో ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్య ధోరణి అనుసరిస్తున్నారని సిఐటియు భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యల్క సోమయ్య గౌడ్ అన్నారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షులు అనంతల మల్లయ్య ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా లేబర్ కమిషనర్ జగదీష్ కు కార్మికుల సమస్యల వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సోమయ్య గౌడ్ మాట్లాడుతూ తక్షణమే పెండింగ్ క్లైమల సమస్యలను పరిష్కరించాలని వెల్ఫేర్ బోర్డు నిధులు దారి మళ్లించి ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయాన్ని విరమించుకొని ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డ్ ద్వారా నేరుగా సంక్షేమ పథకాలను కార్మికులకు అందించాలని, జిల్లాలో కార్మికుల అడ్డా ప్రాంతాలలో కార్మికులు అనేక అవస్థలు పడుతున్నారని పనుల కోసం అడ్డాల వద్ద ముఖ్యంగా మహిళలు మరుగుదొడ్లు లేక అనారోగ్యం పాలవుతున్నారని తక్షణమే అడ్డాలలో ప్రభుత్వం షెడ్లు మంచినీరు మరుగుదొడ్లు మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కరిమల శేఖర్ జిల్లా కమిటీ సభ్యులు మల్లెపాక నగేష్ ఒగ్గు సైదులు మే డే ప్రభాకర్ మైసూర్ ఆలీ సోమయ్య అబ్బాస్ లింగయ్య మల్లయ్య ఉపేందర్ గోపి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.