schedule Tuesday, August 25, 2026

నూతన కమిటీలతో భారతీయ జనతా పార్టీని సంస్థగతంగా బలోపేతం చేయాలి

calendar_today November 12, 2024
person meenewstelugu
నూతన కమిటీలతో భారతీయ జనతా పార్టీని సంస్థగతంగా బలోపేతం చేయాలి

నూతన కమిటీలతో భారతీయ జనతా పార్టీని సంస్థగతంగా బలోపేతం చేయాలి

సంకినేని వెంకటేశ్వరరావు

 మీ న్యూస్ ప్రతినిధి:::భారతీయ జనతా పార్టీ పట్టణ కార్యవర్గ సమావేశం పట్టణ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ గురించి చర్చించడం జరిగింది.. ఇట్టి సమావేశానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి రోజురోజుకు ఆదరణ పెరుగుతుందన్నారు.పట్టణంలోని 112 పోలింగ్ బూత్ లలో నూతనంగా కమిటీలు ఏర్పాటు చేయుటకు 16 శక్తి కేంద్ర ఇన్చార్జిలను నియమించడం జరిగింది. ఈనెల 20 తేదీ నుండి 25 వరకు బూత్ కమిటీలను ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. పార్టీని సంస్థగతంగా బలోపేతం చేయడం ద్వారా మాత్రమే రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తుందన్నారు. బూత్ కమిటీ ఎన్నికల అనంతరం మండల జిల్లా కమిటీలు నియమించుకోవడం జరుగుతుందన్నారు.కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను అమలు చేయకుండా రోజుకొక కొత్త ప్రకటనతో ప్రజలను మభ్యపెడుతుందన్నారు.. రైతులకు ఇప్పటివరకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయలేదన్నారు. వానాకాలం రైతుబంధు ఇవ్వని ఈ ప్రభుత్వం రైతులు ఆరుకాలం పండించిన పంటను అమ్ముకోవడానికి వెళ్తే మద్దతు ధర కూడా రావడం లేదు.. క్వింటాకు 500 బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం అసలు రైతుకు మద్దతు ధర కూడా ఇవ్వట్లేదు... ప్రభుత్వం వెంటనే మిల్లర్లతో మాట్లాడి రైతుల నుంచి మద్దతు ధరకు తగ్గకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు , జిల్లా, పట్టణ నాయకులు శక్తి కేంద్ర ఇన్చార్జిలు, బూత్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు