schedule Wednesday, August 26, 2026

29న జరిగేబహిరంగ సభను జయప్రదం చేయండి.

calendar_today November 12, 2024
person meenewstelugu
29న జరిగేబహిరంగ సభను జయప్రదం చేయండి.

29న జరిగేబహిరంగ సభను జయప్రదం చేయండి.

 సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవింద్ 

 

మీ న్యూస్ ప్రతినిధి :::

 సూర్యాపేట టౌన్: సిపిఎం పార్టీ సూర్యాపేట జిల్లా తృతీయ మహాసభల సందర్భంగా నవంబర్ 29న గాంధీ పార్కులు జరిగే బహిరంగ సభకు వేలాదిగా తరలిరావాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవిందు పిలుపునిచ్చారు. మంగళవారం సూర్యాపేట పట్టణంలోని సీతారాంపురం ఎర్రజెండాల దగ్గర సూర్యాపేటలో జరిగే సిపిఎం జిల్లా మహాసభల కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడుతూ నవంబర్ 29న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ లో వేలాది మందితో బహిరంగ సభ జరుగుతుందన్నారు. ఈ బహిరంగ సభకు సూర్యాపేట వన్ టౌన్ నుండి వందలాది మందిని సమీకరణ చేస్తున్నట్లు చెప్పారు. 12 సంవత్సరాల తరువాత సూర్యాపేట పట్టణంలో సిపిఎం పార్టీ జిల్లా మహాసభలు జరుపుకోవడం సంతోషదాయకం అన్నారు. నవంబర్ 29న గాంధీ పార్క్ లో జరిగే బహిరంగ సభకు సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్, బీవీ రాఘవులు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శితమ్మినేని వీరభద్రం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మిలు హాజరవుతున్నారని అన్నారు.నవంబర్30, డిసెంబర్ 1 తేదీల లో 500 మంది ప్రతినిధులతో సుమంగళి ఫంక్షన్ హాల్ లో మహాసభలు జరుగుతాయని చెప్పారు. ఈ మహాసభల విజయవంతానికై ప్రజలంతా హార్దికంగా,ఆర్థికంగా సహాయ సహకారాలుఅందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీవన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్,పట్టణ కమిటీ సభ్యులు మామిడి పుల్లయ్య, షేక్ జహంగీర్,వట్టె ఎర్రయ్య, అర్వపల్లి లింగయ్య,పిల్లల సతీష్,కప్పల సత్యం,గౌస్ తదితరులు పాల్గొన్నారు.