schedule Wednesday, August 26, 2026

కార్తీక పూజల్లో పాల్గొన్న మాజీమంత్రి జగదీష్ రెడ్డి దంపతులు

calendar_today November 16, 2024
person meenewstelugu
కార్తీక పూజల్లో పాల్గొన్న మాజీమంత్రి జగదీష్ రెడ్డి దంపతులు

కార్తీక పూజల్లో పాల్గొన్న మాజీమంత్రి జగదీష్ రెడ్డి దంపతులు

మీ న్యూస్ ప్రతినిధి :::కార్తిక పౌర్ణమి సందర్బంగా సూర్యపేట జిల్లాలోని జాజిరెడ్డిగూడెం (మం) అర్వపల్లిలోని శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేకంగా జరుగుతున్న స్వామివారి కళ్యాణ వేడుకలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి- సునీత దంపతులు, తుంగతూర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ - కమల దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఇరువురు దంపతులకు ఆశీర్వచనం చేశారు. ఈ వేడుకల్లో భక్తులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.