schedule Tuesday, August 25, 2026

పోలీస్ కార్యాలయం వద్ద టెన్నిస్ కోర్ట్ ప్రారంభించిన జిల్లా కలక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఐఏఎస్, జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ 

calendar_today November 19, 2024
person meenewstelugu
పోలీస్ కార్యాలయం వద్ద టెన్నిస్ కోర్ట్ ప్రారంభించిన జిల్లా కలక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఐఏఎస్, జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ 
పోలీస్ కార్యాలయం వద్ద టెన్నిస్ కోర్ట్ ప్రారంభించిన జిల్లా కలక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఐఏఎస్, జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ 

ఆటలతో మానసిక ఉల్లాసం - జిల్లా కలక్టర్, ఎస్పి

మీ న్యూస్ ప్రతినిధి ::: సూర్యాపేట జిల్లా పోలీసు కార్యాలయం ప్రాంగణం వద్ద ఏర్పాటుచేసిన టెన్నిస్ కోర్టు ప్రారంభానికి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఐఏఎస్ గారు హాజరై జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ ఐపీఎస్ గారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా జిల్లా కలక్టర్  మాట్లాడుతూ ప్రతిరోజు ఆటలు ఆడటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది, మానసిక ఉల్లాసం కలుగుతుందని కలక్టర్  అన్నారు. ఎస్పి  మాట్లాడుతూ నిత్యం విధుల నిర్వహణలో వత్తిడి అధిగమించడానికి సమయం దొరికితే ఆటలపై దృష్టి పెట్టాలని కోరారు, టెన్నిస్ కోర్ట్ ను సద్వినియోగం చేసుకోవాలని తెలిపినారు. క్రీడా కోర్ట్ తయారు చేయడంలో బాగా పని చేసిన, సమన్వయం చేసిన పోలీసు సిబ్బందికి కలక్టర్, ఎస్పి గార్ల చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు.ఈ కార్యక్రమంలో అడ్మిన్ అదనపు ఎస్పి నాగేశ్వరరావు, AR అధనపు ఎస్పి జనార్ధన్ రెడ్డి, సూర్యాపేట సబ్ డివిజన్ DSP రవి, AR DSP నరసింహ చారి, CI సురేందర్ రెడ్డి, RI నారాయణ రాజు, RSI లు, SI లు తదితరులు పాల్గొన్నారు.