schedule Tuesday, August 25, 2026

పోలీసు కుటుంబాలకు బాసటగా భద్రత స్కీమ్ 

calendar_today December 1, 2024
person meenewstelugu
పోలీసు కుటుంబాలకు బాసటగా భద్రత స్కీమ్ 

పోలీసు కుటుంబాలకు బాసటగా భద్రత స్కీమ్ 

భద్రత ప్రమాద భీమా చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్

మీ న్యూస్ ప్రతినిధి :::సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయం అడ్మినిస్ట్రేషన్ విభాగం నందు సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న శ్రీనివాస్ రెడ్డి ఆకాలంగా మరణించడం జరిగినది. ఇతని కుటుంబ సభ్యులకు పోలీసు భద్రత స్కీమ్ ద్వారా 8 లక్షల రూపాయల చెక్కును ఈరోజు జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్  జిల్లా పోలీసు కార్యాలయం నందు అందించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సిబ్బంది కుటుంబాల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ పోలీసు శాఖ కృషి చేస్తుంది. భద్రత పథకం సిబ్బంది కుటుంబాలకు బాసటగా ఉన్నది అన్నారు. ఈ కార్యక్రమం నందు అధనపు ఎస్పి నాగేశ్వరరావు, AO మంజు భార్గవి, పోలీసు సమంఘం సెక్రెటరీ వెంకన్న, సెక్షన్ సూపరింటెండెంట్ విజయ్, సిబ్బంది పాల్గొన్నారు.