schedule Wednesday, August 26, 2026

శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపనకు రూ.1లక్ష 11వేలవిరాళం.

calendar_today December 7, 2024
person meenewstelugu
శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపనకు రూ.1లక్ష 11వేలవిరాళం.

శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపనకు రూ.1లక్ష 11వేలవిరాళం.

తాండూర్ మండల బీ.ఆర్.ఎస్ పార్టీ బీ.సీ సెల్ అధ్యక్షుడు ఆర్.సీ గౌడ్.

 

తాండూరు మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 7....తాండూరు మండలం మల్కాపూర్ గ్రామంలో స్థాపిస్తున ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహ ప్రతిష్టాపన కొరకై శనివారం ఛత్రపతి శివాజీ యువజన సంఘం నాయకులు తాండూర్ మండల బీ.ఆర్.ఎస్ పార్టీ బీ.సీ సెల్ అధ్యక్షుడు ఆర్.సీ గౌడ్ ని కలిశారు. శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన కొరకై ఆర్.సీ గౌడ్ 1,11,000/- (ఒక్క లక్ష పదకొండు వేలు) అందజేశారు. ఈ సందర్భంగా బీ.ఆర్.ఎస్ పార్టీ బీ.సీ సెల్ అధ్యక్షుడు ఆర్.సీ గౌడ్ మాట్లాడుతూ శివాజీ మహారాజ్ వీరత్వాన్ని గుర్తు చేశారు. ఆయన చూపిన మార్గంలో నడుచుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్ సి గౌడ్ యువసేన సభ్యులు,  ఛత్రపతి శివాజీ యువజన సంఘం నాయకులు గ్రామస్తులు యువకులు తదితరులు పాల్గొన్నారు.