schedule Saturday, August 22, 2026

మోతే మండలంలో ధాన్యం దొంగలను పట్టుకున్న రైతులు...

calendar_today December 8, 2024
person meenewstelugu
మోతే మండలంలో ధాన్యం దొంగలను పట్టుకున్న రైతులు...

మోతే మండలంలో ధాన్యం దొంగలను పట్టుకున్న రైతులు...

   

 మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 7:: సూర్యాపేట జిల్లా మోతే మండలంలో ఐకెపి కేంద్రంలో ధాన్యం లోడు చేసుకొని వచ్చిన లారీ నుంచి ధాన్యం బస్తాలను దొంగిలిస్తుండగా పట్టుకున్న సంఘటన మండల పరిధిలోని రాఘవపురం ఎక్స్ రోడ్డు వద్ద రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని నేరడ వాయి ఐకెపి కేంద్రం నుంచి లారీ డ్రైవర్ జిల్లపల్లి చిరంజీవి అను అతను, లారీ నెంబర్ టిఎస్. 29 టి 5688 లారీలో ధాన్యం లోడు చేసుకున్నాడు. లోడు చేసుకొని మిల్లుకు వెళ్తుండగా రాఘవపురం క్రాస్ రోడ్డు వద్దకు వచ్చాడు. లారీ డ్రైవర్ బంధువులైన నవిలా హుస్సేన్, ఆటో డ్రైవర్ పూజల భాస్కర్ ఆటోలో లారీలో నుంచి ఆరు ధాన్యం బస్తాలు తీసి వేయగా, తెలిసిన సమాచారం మేరకు అక్కడికి వెళ్లి పట్టుకున్నట్లు ఎస్ఐ యాదవేందర్ రెడ్డి తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.