మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 9 ::: మోతె పోలీస్ స్టేషన్లో 9- 12- 2024న మోతే పోలీస్ స్టేషన్ నందు ఆరుగురిని నిందితులను అరెస్టు చేయడం జరిగినది నిందితుల నుండి 40 వేల విలువగల ఒక కేజీ 640 గ్రాముల గంజాయిని ఐదు సెల్ ఫోన్ మూడు బైకులు సాధన చేసుకున్నారు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన 19 సంవత్సరాల సుభాష్ అంతలా( a.1) అనే వ్యక్తి గంజాయి తాగటం అలవాటు ఉన్నది గంజాయి ఇతరులకు అమ్ముతూ వ్యాపారం చేసేవాడు ఇతడు ఒరిస్సా రాష్ట్రంలోని గొల్లూరు ప్రాంతం చుట్టుపక్కల గంజాయిని కొనుగోలు చేసేవాడు సుభాష్ నెలరోజుల క్రితం రైలులో అరకు వెళ్లుచుండగా (a. 2) బత్తుల హరీష్(a. 3) బత్తుల విరాట్ అనే ఇద్దరు ఖమ్మం జిల్లాకు చెందినవారు అతనికి పరిచయమైన వారు అప్పటినుండి బత్తుల హరీష్ బత్తుల విరాట్ లు సుభాష్ నుండి గంజాయి కొనుగోలు చేసి అమ్ముచుండేవారు ఈనెల 5వ తేదీన బత్తుల హరీష్ బత్తుల విరాట్ ఇద్దరు సుభాష్ కి ఫోన్ చేసి గంజాయి కావాలని దాన్ని తీసుకొని ఖమ్మం రమ్మని ఎక్కువ డబ్బులు ఇస్తామని చెప్పగా సుభాష్ 8వ తేదీన అనగా ఆదివారం రోజు గంజాయి రెండు బ్రౌన్ కలర్ ప్యాకెట్లలో ప్యాక్ చేసుకొని కాలేజీ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకొని ఖమ్మం కు వచ్చారు బత్తుల విరాట్ బత్తుల హరీష్ షేక్ హుస్సేన్ భాష అనే ముగ్గురు సుభాష్ ను కలిసి అతని వద్ద ఉన్న గంజాయిని తీసుకొని స్కూటీ డిక్కీలో పెట్టుకొని నలుగురు కలిసి రెండు బైకులపై బయలుదేరి మామిళ్లగూడెం గ్రామ శివారులో గల సింగరేణి టోల్ ప్లాజా వద్దకు రావడం జరిగింది బత్తుల హరీష్ బత్తుల విరాట్లకు పరిచయం ఉన్న గంజాయి తాగే అలవాటు ఉన్న (a.4 ) వెలుగు జయసింహ (a. 5) దోసపాటి కళ్యాణ్ రామ్(a. 6) పగడాల ఉదయ్ కుమార్ రెడ్డి వెలుగు ఆనంద్ మరియు కొండా ఉదయాలను టోల్ ప్లాజా వద్ద గల వెంచర్కు రమ్మన్నారు టోల్ ప్లాజా వద్ద గల వెంచర్ కి వచ్చిన వారిని నమ్మదగిన సమాచారంపై మోతే పోలీసులు ఈరోజు అరెస్టు చేసి రిమాండ్ తరలించటం జరిగినది గంజాయి వాహనాలు మొబైల్స్ మొత్తం వాటి విలువ770000 ఉంటుందని అంచనా వేయడం జరిగినది పట్టుబడి చేసిన దాంట్లో మోతే ఎస్సై యాదవేంద్ర రెడ్డి హెడ్ కానిస్టేబుల్స్ వెంకటేశ్వర్లు కానిస్టేబుల్స్ వీరస్వామి రామ నరసయ్య సుమన్ మరియు షరీఫ్ లను పర్యవేక్షణ చేసి సిఐ రామకృష్ణారెడ్డి ఉన్నతాధికారులు అభినందించారు