schedule Tuesday, August 25, 2026

ఆశ వర్కర్ల పై ప్రభుత్వ నిర్భంధం అక్రమ అరెస్టులు ఖడించండి

calendar_today December 10, 2024
person meenewstelugu
ఆశ వర్కర్ల పై ప్రభుత్వ నిర్భంధం అక్రమ అరెస్టులు ఖడించండి

ఆశ వర్కర్ల పై ప్రభుత్వ నిర్భంధం అక్రమ అరెస్టులు ఖడించండి

ఆశ వర్కర్ల యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు వెంపటి గురూజీ

పోలీస్ స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేసిన ఆశ వర్కర్లు

   

 మీ న్యూస్ సూర్యాపేట ప్రతినిధి డిసెంబర్ 10 :::సూర్యాపేట: ఆశ వర్కర్లపై ప్రభుత్వం నిర్బంధం, అక్రమ అరెస్ట్ లను ఖండించాలని, హైదరాబాదులో వేతనాలు పెంచాలని కోరుతూ మెడికల్ డైరెక్టరేట్ ధర్నా నిర్వహిస్తున్న ఆశా వర్కర్ల ను, మహిళలను చూడకుండా నానా దుర్భషలాడుతూ, అరెస్ట్ చేయడం అమానుషమని ఆశ వర్కర్ల యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు, బిఆర్ టియు జిల్లా అధ్యక్షుడు వెంపటి గురూజీ అన్నారు. సూర్యాపేట పట్టణంలో ఆశ వర్కర్లను విధుల్లోకి వెళ్ళకుండా పోలీసులు నిర్బంధం లో తీసుకోవటం అన్యాయమని ఆశ వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ వద్ద మంగళవారం నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు 18000 వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. బిఆర్ఎస్ ప్రభుత్వంకన్న మెరుగైన వేతనం ఇస్తామని, ప్రజా ప్రభుత్వం ప్రజా తెలంగాణలో నిర్బంధం ఉండదని స్వేచ్ఛగా సభలు సమావేశాలు నిర్వహించుకునే స్వేచ్ఛ ఉంటుందని అధికారంలో రాకముందు చెప్పిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చడం హాస్యాస్పదమని అన్నారు .ఆశా వర్కర్స్ గోంతేమ్మ కోర్కెలు ఏమి కోరడం లేదని కుటుంబ పోషణ కొరకు నిర్థిష్ట వేతనం పెంచాలని,గత ప్రభుత్వం అమలు చేసిన వేతనం 9750 రూపాయలే అమలవుతుందని వచ్చిన వేతనాలు సరిపోక కరోనా ఇపత్కర సమయంలో కానీ, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు అందించడంలో ప్రజలకు సేవలను అందించడంలో ఆశ వర్కర్లు ముందుంటున్నారని తెలిపారు. తక్షణమే ఎన్నికల ముందు ఇచ్చిన హామీప్రకారం 18 వేల రూపాయలను తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.లేనిచో భవిష్యత్ లో ఆశ వర్కర్స్ సమ్మె లోకి వెళితే ప్రభుత్వమే భాద్యత వహించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్ల యూనియన్ పట్టణ అధ్యక్షురాలు గౌరీదేవి సక్కుబాయి, కె. బైనా భాయ్, పి ఉమా, డి, సునీత, ఎం, మణెమ్మ, పి, సైదమ్మ, సునీత, మరియమ్మ, విజయలక్ష్మి, నిర్మల, స్వర్ణలత, సరిత, నాగలక్ష్మి, జయమ్మ, వసంత, తదితరులు పాల్గొన్నారు.