schedule Saturday, June 13, 2026

సూర్యాపేట జిల్లా కేంద్రంలో పోలీసుల కార్డన్ సెర్చ్ 

calendar_today December 11, 2024
person meenewstelugu

సూర్యాపేట జిల్లా కేంద్రంలో పోలీసుల కార్డన్ సెర్చ్ 

 

శాంతి భద్రతల సంరక్షణకు ప్రజలు సహకరించాలి

శాంతిభద్రతల సంరక్షణకు ప్రజలు సహకరించాలని సూర్యాపేట డిఎస్పి రవి కోరారు.

 మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 10 :: సూర్యాపేట జిల్లా కేంద్రం 60 ఫీట్ల రోడ్డు నందు మంగళవారం రాత్రి కార్డెన్ అండ్ సర్చ్ నిర్వహించి, సామాజిక అంశాలపై పోలీసు కళాబృందం వారిచే అవగాహన కార్యక్రమం పట్టణ పోలీసులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన సూర్యాపేట డిఎస్పి రవి మాట్లాడుతూ పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సూర్యాపేట పట్టణ కేంద్రం నందు గల 60 ఫీట్ల రోడ్డు విద్యానగర్ ప్రాంతాల్లో సూర్యాపేట పట్టణ పోలీసులు కార్డన్ అండ్ సర్చ్ కార్యక్రమం ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. అనుమతి పత్రాలు లేనటువంటి 52 ద్విచక్ర వాహనాలను, మూడు ఆటోలను సీజ్ చేశామని చెప్పారు. ప్రజలకు, మహిళలకు మెరుగైన భద్రత రక్షణ కల్పించడంలో భాగంగానే ఆకస్మికంగా కార్డెన్ అండ్ సర్చ్ నిర్వహించామని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ, రోడ్డు భద్రత, దొంగతనాల నివారణ, సీసీ కెమెరాలు ఏర్పాటు, సైబర్ నేరాల నివారణ, మహిళల భద్రత మొదలగు అంశాల గురించి ప్రజలకు సూచించారు. పోలీసుల సూచనలు, ఆదేశాలకు అనుగుణంగా ప్రజలు నడుచుకోవాలని కోరారు. వాహనదారులు వాహనాలకు అనుమతి పత్రాలు కలిగి ఉండాలని అన్నారు. గుర్తింపు లేని వారికి అనుమానితులకి, కొత్త వ్యక్తులకు ఇండ్లు కిరాయికి ఇవ్వవద్దు అని కోరారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని డిఎస్పి రవి కోరారు. ఈ కార్డెన్ అండ్ సెర్చ్ లో పట్టణ సీఐ వీరరాఘవులు, రూరల్ సీఐ రాజశేఖర్, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.