schedule Tuesday, August 25, 2026

మెప్మా ఆర్పిల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి

calendar_today December 14, 2024
person meenewstelugu
మెప్మా ఆర్పిల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి

మెప్మా ఆర్పిల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి

మెప్మా ఆర్పి లను ముందస్తు అరెస్టు చేయడం తగదు

మెప్మా ఆర్పిల సంఘం జిల్లా అధ్యక్షురాలు అన్నపర్తి రాణి

 

 మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 13 :::: మున్సిపాలిటీలోని పేదరిక నిర్మూలన సంస్థల ప్రముఖ భూమిక పోషించే మెప్మా రిసోర్స్ పర్సన్స్ కనీస వేతనాలు సరైన సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆర్పీలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మెప్మా రిసోర్స్ పర్సన్స్ సంఘం జిల్లా అధ్యక్షురాలు అన్నపర్తి రాణి అన్నారు. సమస్యలు పరిష్కరించాలని హైదరాబాద్కు వెళ్తున్నామనే అనుమానంతో పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడం పట్ల ఆర్పీలు తీవ్ర నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి సర్వేను ఆర్పీలు నిర్వహిస్తున్నారని ప్రతి కార్యక్రమంలో తాము పాలు పంచుకుంటున్నామన్నారు. ప్రభుత్వం ఆర్పి లను గుర్తించి కనీస వేతనం 18000 ఇవ్వడంతో పాటు నెల వేతనాలు అందజేయాలన్నారు. అలాగే హెల్త్ కార్డు ఇన్సూరెన్స్ సౌకర్యంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కోలా మంగ, ఉపాధ్యక్షులు గోనే విజయమ్మ, సాయిని పద్మావతి, రాజేశ్వరి, కప్పల పద్మ, నూర్జహాన్, రేణుక, నాగేశ్వరి, సంధ్యారాణి, జానకి, లక్ష్మి తదితరులు ఉన్నారు.