schedule Tuesday, August 25, 2026

సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె

calendar_today December 14, 2024
person meenewstelugu
సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె

సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె

 మీ న్యూస్ ప్రతినిధి  డిసెంబర్ 13  ::: సూర్యాపేట కలెక్టరేట్ వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మెకు నాలుగో రోజు శుక్రవారం CITU జిల్లా నాయకులు, గ్రామపంచాయతీ కార్మిక సంఘం నాయకులు సంఘీభావం తెలిపారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మది వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్న వారు పర్మినెంట్ కు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీని వారు నిలబెట్టుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం రాంబాబు గారు గ్రామపంచాయతీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ధనియాకుల శ్రీనివాస్ ఉపాధ్యక్షులు చిట్యాల రవిచంద్ర మరియు సిఐటియు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు