schedule Saturday, June 13, 2026

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్  గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు

calendar_today December 14, 2024
person meenewstelugu

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ 

   

 మీ న్యూస్ ప్రతినిధి  ప్రతినిధి డిసెంబర్ 13 :గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జీపి కార్మికుల సంఘం జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు డిసెంబర్ 17 తేదీ హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని సూర్యాపేట సిఐటియు జిల్లా నాయకులు తెలిపారు. శుక్రవారం డిపిఓ కు మహా ధర్నా మెమోరాండం అందజేశారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే 20 తేదీ తర్వాత ఏ క్షణమైనా సమ్మెకు దిగుతామని తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మాది వెంకటేశ్వర్లు జిల్లా అధ్యక్షుడు రాంబాబు జిపి కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ ఉపాధ్యక్షుడు రవిచంద్ర పరశురాములు తదితరులు పాల్గొన్నారు