schedule Tuesday, August 25, 2026

రైతులపై దాడిని ఖండిస్తూ మోడీ దిష్టిబొమ్మ దహనం

calendar_today December 16, 2024
person meenewstelugu
రైతులపై దాడిని ఖండిస్తూ మోడీ దిష్టిబొమ్మ దహనం

రైతులపై దాడిని ఖండిస్తూ మోడీ దిష్టిబొమ్మ దహనం

కొత్తపల్లి శివకుమార్ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి

 

మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 15 ::: గిట్టుబాటు ధరకై ఢిల్లీ లో ధర్నాకు బయలుదేరుతున్న రైతులను డిల్లీ సరిహద్దుల్లో టిఆర్ గ్యాస్ ఉపయోగించి దాడులు చేయడాన్ని ఖండిస్తూ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు 

     మోడీ ప్రభుత్వం వచ్చాక రైతులను కార్మికులను నిర్లక్ష్యం చేస్తూ చట్టాలను మారుస్తూ అంబానీ ఆదానికి అండగా నిలబడుతూ వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేసే దిశగా అడుగులు వేస్తూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా ఇబ్బందులకు గురి చేస్తుంటే దాన్ని వ్యతిరేకిస్తూ మాకు గిట్టుబాటు ధర కావాలని ఢిల్లీలో ధర్నాకు బయలుదేరిన రైతులను శంభు సరిహద్దు వద్ద నిర్ధాక్షిణ్యంగా పోలీసులతో దాడులు జయించి టీఆర్ గ్యాస్ ఉపయోగించి 18 మంది రైతులను గాయాల పాలు చేశారు ఇది మోడీ నియంతృత్వానికి నిదర్శనం మోడి నియంతృత్వ విధానాలను ఖండిస్తూ రైతుల యొక్క డిమాండ్లను నెరవేర్చాలని మోడీని డిమాండ్ చేస్తూ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పారింగుల వెంకన్న పిఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక పిడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ అరుణోదయం జిల్లా నాయకులు గొడ్డలి నరసన్న పి ఓ డబ్ల్యు జిల్లా అధ్యక్షులు చంద్రకళ పార్టీ డివిజన్ నాయకులు ఎస్కే సయ్యద్ పివోడబ్ల్యు సహాయ కార్యదర్శి సంతోషి నాయకులు పద్మ రేణుక పిఓఎల్ నాయకులు రమేష్ రాహుల్ తదితరులు పాల్గొన్నారు

.