schedule Tuesday, August 25, 2026

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలను సమర్పించాలని రాష్ట్ర మాజీ మంత్రి కేటీఆర్

calendar_today December 16, 2024
person meenewstelugu
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలను సమర్పించాలని రాష్ట్ర మాజీ మంత్రి కేటీఆర్

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలను సమర్పించాలని రాష్ట్ర మాజీ మంత్రి కేటీఆర్

భారత రాష్ట్ర సమితి నాయకులకు, పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి*

మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 16 :: కొడంగల్ నియోజకవర్గం లోని లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి, వారిపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించి, రైతన్నల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ,అమానవీయ, అణిచివేత విధానాలకు నిరసనగా... రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి, వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో  మంగళవారం రోజున్న ఉదయం 11 గంటలకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలను సమర్పించాలని రాష్ట్ర మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు