సీఎం ప్రజావాణి ,కలెక్టరేట్ ప్రజావాణిలో దరఖాస్తులు వెంటనే పరిష్కారం కావాలి....
ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రోటోకాల్ పాటించాలి...
ఇంటింటి కుటుంబ సర్వే కి సహకరించిన అధికారుల అందరికీ శుభాకాంక్షలు....
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్...
మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 16 ::: సిఎం ప్రజావాణి, ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను ప్రాధాన్యత ఇస్తూ సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ అదనపు కలెక్టర్ పి రాంబాబుతో కలిసి ప్రజల నుండి విన్నపాలను స్వీకరించారు. ఈరోజు జరిగిన ప్రజావాణిలో మొత్తం 79 ఫిర్యాదులు అందాయి, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దరఖాస్తులలో ఎక్కువగా తాసిల్దార్ లకు భూములకు సంబంధించిన 22 దరఖాస్తులు వచ్చాయన్నారు. మండలాధికారులు మండలాలలో నిర్వహిస్తున్న ప్రజావాణిలో ప్రజలు తమ సమస్యలపై చేసుకుంటున్న దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. ఫిర్యాదుదారుడి దరఖాస్తు పరిష్కరించ లెకపోతే దానికి గల కారణాలను వెంటనే దరఖాస్తుదారునికి తెలియజేయాలని, వివరాలు రాతపూర్వకంగా అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు తప్పనిసరిగా ప్రోటోకాల్ ను తప్పక పాటించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఇంటింటి కుటుంబ సమగ్ర సర్వే సమిష్టిగా అధికారులందరూ కృషిచేసి విజయవంతం చేసినందుకు కలెక్టర్ స్వయంగా శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అధికారులు తమ శాఖలకు సంబంధించిన కోర్టు కేసులు వెంటనే స్పందించాలని తెలిపారు. జిల్లాలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేని కూడా సంబంధిత అధికారులు సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ అన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని కలెక్టర్ ఆదేశించారు .ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో వి వి అప్పారావు, డిఎఫ్ఓ సతీష్ కుమార్, సిపిఓ ఎల్ కిషన్, డియమైన హెచ్ ఓ కోటాచలం, డిఈఓ అశోక్, డి టి డి ఓ శంకర్, డిడబ్ల్యుఓ నరసింహారావు, డీఎవో భాస్కర్ రెడ్డి, డి ఎం డబ్ల్యు ఓ జగదీష్ రెడ్డి ఎసిడి కార్పొరేషన్ శ్రీనివాస్ నాయక్ ఎస్సీ అభివృద్ధి అధికారి లత బిసి అభివృద్ధి అధికారి అనసూయ ఎల్ డి ఎం బాపూజీ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.