schedule Wednesday, August 26, 2026

కబడ్డీ అసోసియేషన్ మోతే మండల ప్రధాన కార్యదర్శిగా జంపాల గోపి ఎన్నిక

calendar_today December 20, 2024
person meenewstelugu
కబడ్డీ అసోసియేషన్ మోతే మండల ప్రధాన కార్యదర్శిగా జంపాల గోపి ఎన్నిక

కబడ్డీ అసోసియేషన్ మోతే మండల ప్రధాన కార్యదర్శిగా జంపాల గోపి ఎన్నిక

   

మోతే మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 19 : మోతే మండల కబడ్డీ అసోసియేషన్ మండల ప్రధాన కార్యదర్శిగా మోతే మండలం సిరికొండ గ్రామానికి చెందిన జంపాల గోపి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే సూర్యాపేట జిల్లా నుండి 2025 జనవరి 12న జరిగే రాష్ట్రస్థాయి సీఎం కప్ కబడ్డీ పోటీలకు సూర్యాపేట జిల్లా నుండి క్రీడాకారుడుగా ఎంపిక అయ్యారు. ఈ సందర్భంగా జంపాల గోపి మాట్లాడుతూ చిన్నప్పటినుండి తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల శిక్షణ మూలంగా ఈ స్థాయికి ఎదిగానని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సహకారం అందిస్తే జిల్లాకు, రాష్ట్రానికి పేరు ప్రతిష్టలు తీసుకురావడానికి ఎల్లవేళలా కృషి చేస్తానని అన్నారు. తనను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.