గ్రామపంచాయతీ సిబ్బందిని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి లేకుంటే ఈ నెల 27 28న టోకెన్ సమ్మె....
calendar_today
December 20, 2024
person
meenewstelugu
గ్రామపంచాయతీ సిబ్బందిని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి లేకుంటే ఈ నెల 27 28న టోకెన్ సమ్మె
గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు చిట్యాల రవిచంద్ర డిమాండ్
మోతే మీ నేను ప్రతినిధి డిసెంబర్ 19 :::సూర్యాపేట జిల్లా మోతె మండలంతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న 60 వేల మంది కార్మికులందరినీ శాశ్వత ఉద్యోగులుగా గుర్తించి, వారికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాలని గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు అనుబంధం) సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు చిట్యాల రవిచంద్ర డిమాండ్ చేశారు. గురువారం నాడు మోతే మండల ఎంపీడీవో ఆఫీస్ ముందు చలో హైదరాబాద్ కార్యక్రమానికి కార్మికుల పోకుండా అడ్డుకున్న సందర్భంగా అక్రమ అరెస్టులను, నిర్బంధాలను వ్యతిరేకిస్తూ గురువారం నాడు నిరసన కార్యక్రమం నిర్వహించారు గ్రామాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచి, ప్రజల ఆరోగ్యాన్ని, గ్రామాలను కాపాడుతున్న పారిశుద్ధ్య కార్మికుల పట్ల ప్రభుత్వ మొండి వైఖరి విడనాడి కనీస వేతనం 26 వేల రూపాయలు అమలు చేసి, పదవీ విరమణ 10 లక్షల రూపాయల సౌకర్యం కల్పించి, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బహుళ పని విధానం గ్రామపంచాయతీ కార్మికులకు అతి ప్రమాదకరమైనదని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ కార్మికుల మెడపై ఉరితాడు లా మారిన మల్టీపర్పస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం 9500 కనీస వేతనంగా నిర్ణయించి అమలు చేస్తుంటే ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తన పదవీకాలం గడిచిన గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పట్టించుకోవడంలేదని ఆరోపించారు. వెంటనే ప్రభుత్వం ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశంలో గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చర్చించి, నిర్ణయం తీసుకోకుంటే ఈనెల 26 27న టోకెన్ సమ్మె చేస్తామని, భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎంపీడీవోకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బొమ్మగాని వెంకటేశ్వర్లు పరుశురాములు గ్రామపంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు...