అంబేడ్కర్ ను అవమానించిన అమిత్ షా మనువాద వ్యాఖ్యలను ఖండించండి
calendar_today
December 20, 2024
person
meenewstelugu
అంబేడ్కర్ ను అవమానించిన అమిత్ షా మనువాద వ్యాఖ్యలను ఖండించండి
అమిత్ షా దేశప్రజలకు క్షమాపణ చెప్పాలి
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు
మోతే మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్19:::: మోతే:కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను పార్లమెంటు సాక్షిగా అవమానించారని, ఎగతాళి చేసి అహంకారంగా మాట్లాడటాన్ని ప్రజలు, ప్రజాస్వామిక వాధులు ఖండించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు గురువారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. అమిత్ షా అంబేద్కర్ పట్ల ఆర్ ఎస్ ఎస్ బీజేపీ కి ఉన్న అవగాహణనను వ్యక్తం చేశారని అట్టడుగు వర్గాల పట్ల వారి వైఖరిని చెప్పారని అన్నారు. దుర్మార్గమైన దారుణమైన అహంకార చర్యను అందరూ ఖండించాలన్నారు .
ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ వద్ద నిరసన తెలపడం హర్షణీయమన్నారు.
ఈ మతోన్మాద చర్యను సిపిఎంఖండిస్తుందన్నారు. అమిత్ షా క్షమాపణ చెప్పాలన్నారు.
ఎన్నిసార్లు అంబేద్కర్ అని పదే పదే అతడిని స్మరించుకుంటారు దానికి బదులుగా ఏదో ఒక హిందూ దేవుడిని స్మరించుకుంటే మీకు 7 జన్మలకు స్వర్గం దక్కుతుందనడం సిగ్గు చేటన్నారు. అలా అనటమే కాకుండా మాటి మాటికీ అంబేద్కర్ పేరు ఎత్తడం వీళ్లకు పెద్ద ఫ్యాషన్ అయిపోయిందని ఏగతాళిగా మాట్లాడటం తగదన్నారు.
ఎన్పికల ముందు అంబేద్కర్ పేరు జపం చేసి అధికారం లోకి వచ్చాక ఆయన పేరు ఎత్తకూడదని చెప్పటం సిగ్గు చేటన్నారు . నేటి మనువాద మతోన్మాద ప్రభుత్వంలో రాజ్యాంగం పై, ప్రభుత్వరంగ సంస్ధలపై దాడి జరుగుతుందన్నారు.
ఈ దాడులను వ్యతిరేకిస్తూ రాజ్యాంగాన్ని కాపాడుకోవలిసిన అవసరం ఉందన్నారు.