schedule Saturday, August 22, 2026

ఎస్సీ వర్గీకరణ ను వెంటనే అమలు చేయాల

calendar_today December 20, 2024
person meenewstelugu
ఎస్సీ వర్గీకరణ ను వెంటనే అమలు చేయాల

ఎస్సీ వర్గీకరణ ను వెంటనే అమలు చేయాలి 

ఎనిమిది మాదిగ సంఘాలతో కలిసి ఏకసభ్య కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ ని కలిసి వినతి పత్రం అందజేసినమాజీ మంత్రి కాంగ్రెస్ నేత డాక్టర్ ఏ చంద్రశేఖర్ 

   

మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 20 ::: హైదరాబాద్ ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతిని ఇస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన చారిత్రాత్మక తీర్పు ఆధారంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.తెలంగాణ రాష్ట్రంలో మాదిగల జనాభా నిష్పత్తి ప్రకారం మాదిగలకు వాటా దక్కేల రిజర్వేషన్ల వర్గీకరణ చేయాలని విజ్ఞప్తి చేశారు.ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే దేశంలోనే మొట్టమొదటగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీకరణ పై అసేంబ్లీ లో ప్రకటన చేయడం పట్ల మాదిగలంతా హర్షిస్తున్నారని అన్నారు. ఏకసభ్య కమిషన్ తో ఎస్సీ వర్గీకరణ త్వరితగతిన పూర్తి అవుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎనిమిది మాదిగ సంఘాల నేతలు నాయకులు సతీష్ మాదిగ, మేరీ మాదిగ తదితర నాయకులు పాల్గోన్నారు.మీ 31న్యూస్ ప్రతినిధి కె అశోక్