అక్రమ కేసులకు భయపడేది లేదు బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై .వెంకటేశ్వర్లు
calendar_today
December 21, 2024
person
meenewstelugu
అక్రమ కేసులకు భయపడేది లేదు బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై .వెంకటేశ్వర్లు
సూర్యాపేట మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్: 20::తెలంగాణ బి.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టిన అప్రమ కేసులను ఖండించిన టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై. వెంకటేశ్వర్లు.తప్పు చేయలేదు భయపడేది లేదు గౌరవనీయులు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పై పెట్టిన అక్రమ కేసుల్ని ఎత్తివేయాలి.ఫార్ములా ఈ రేసు హైదరాబాదు నగరాన్ని విశ్వ నగరాల సరసన చేర్చింది ఇందుకోసం ఖర్చుపెట్టిన 55 కోట్ల రూపాయలు ముట్టినట్లు ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా వెల్లడించింది అన్నారు. ఇందులో అవినీతిఎక్కడ ఉంది రాజకీయపక్ష తప్ప మరొకటి లేదు మీరు ఇచ్చిన హామీల నుంచి పక్కకు తప్పుకోవటానికి ప్రజలను గందరగోళపరచవచ్చునని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు ఈ రేసు నిర్వహించిన తర్వాత తెలంగాణకు సుమారు 700 కోట్ల రూపాయల ఆర్థిక లబ్ధి చేకూరింది అని నీల్సంస్పోర్ట్స్ అనాలసిస్ సంస్థ తెలిపింది ఆతిధ్య నగరంగా హైదరాబాదు పరపతి పెరిగింది అన్నారు.