schedule Saturday, June 13, 2026

ఎం ఎస్ రెడ్డి పాఠశాలలో ఘనంగా ఎడ్యుకేషన్ ఫెయిర్ 

calendar_today December 21, 2024
person meenewstelugu

ఎం ఎస్ రెడ్డి పాఠశాలలో ఘనంగా ఎడ్యుకేషన్ ఫెయిర్ 

సూర్యాపేట మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 21

వ్రముఖ శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్గారి జన్మదినం పురస్కరించుకొని జాతీయ గణిత దినోత్సవంను సందర్భంగా ఎం ఎస్ రెడ్డి పాఠశాలలో విద్యార్థులు ఘనంగా ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు గణిత నమూనాలులో పజిల్స్ మరియు తల్లిదండ్రులు అడిగే ప్రశ్నలకు సులభరీతిలో సమాధానాలు చెప్పడం, రంగు రంగుల ఆకర్షణీయమైన ప్రదర్శనలు తల్లిదండ్రులను ఆకట్టుకున్నాయి. విద్యార్థులు ఎంతో చక్కగా వారి ప్రదర్శనలను వివరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ చామకూరి శ్రీనివాస్ గౌడ్ , ప్రిన్సిపల్ రజిని దేవి , టీచర్స్ , స్వర్ణలత, శివాని,అనూష , ఉష, మౌనిక, రమాదేవి, మల్లిక, సంగీత మరియు తల్లిదండ్రులు పాల్గొని ప్రదర్శనలను తయారు చేసిన విద్యార్థులను అభినందించారు. పిల్లల బంగారు భవిష్యత్తు కి పాఠశాలలో ఇలాంటి ప్రదర్శనలు చేయించడం ఆనందకరమైనదిగా తల్లిదండ్రులు తెలిపారు.