schedule Monday, August 24, 2026

విద్యార్థులు న్యాయ సేవలు పై అవగాహన

calendar_today December 23, 2024
person meenewstelugu
విద్యార్థులు న్యాయ సేవలు పై అవగాహన

విద్యార్థులు న్యాయ సేవలు పై అవగాహన

 మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 22 :::

సూర్యాపేట జిల్లా కోదాడ...భావితరం వారసులుగా విద్యార్థులు న్యాయ సేవలు పై అవగాహన పెంచుకొని చదువుపై దృష్టి సారించి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ,సీనియర్ సివిల్ జడ్జి పి శ్రీవాణి అన్నారు. మునగాల మండల పరిధిలోని ఆకుపాముల గ్రామంలో గల మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాల, కళాశాలలో కోదాడ మండల లీగల్ సెల్ చైర్మన్,సీనియర్ సివిల్ జడ్జి సురేష్ తో కలిసి ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో వారు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన పెంచుకుంటే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని ముఖ్యంగా కళాశాలలో యువత ఏమాత్రం తప్పటడుగు వేసిన భవిష్యత్తులో జీవితం అంధకారంగా మారే అవకాశం లేకపోలేదు అన్నారు.అందరికీ న్యాయం రాజ్యాంగం కల్పించిన హక్కు అని చట్టాలు, ఉచిత న్యాయ సేవలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.మత్తు పదార్థాలు,బాల్య వివాహాలు,పిల్లల్ని పనిలో పెట్టుకోవడం,మూఢనమ్మకాలు,వరకట్నం వేధింపులు వాటికి దూరంగా ఉండాలన్నారు.ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధచట్టాలపై అవగాహన కల్పించారు.అనంతరం పాఠశాల ఆవరణలో భోజన శాల,హాస్టల్ గదులుపరిశీలించి ప్రిన్సిపాల్ కు తగు సూచనలు చేశారు.