schedule Monday, August 24, 2026

ఫ్లై ఓవర్స్ రోడ్డు పక్కన స్పీడ్ బ్రేకర్లు నిర్మించాలలి

calendar_today December 23, 2024
person meenewstelugu
ఫ్లై ఓవర్స్ రోడ్డు పక్కన స్పీడ్ బ్రేకర్లు నిర్మించాలలి

ఫ్లై ఓవర్ రోడ్డు పక్కన స్పీడ్ బ్రేకర్లు నిర్మించాలలి

 

స్పీడ్ బేకర్లు లేక నిత్యం ప్రమాదాలకు గురి అవుతున్న వాహనదారులు

 

సూర్యాపేట మీ న్యూస్ ప్రతినిధి   డిసెంబర్ 23::::ఎన్ హెచ్ ఏ ఐ వారు నిర్మించిన సూర్యాపేట నుండి ఖమ్మం వెళ్లే రహదారుల్లో ఫ్లై ఓవర్ రోడ్డు పక్కన స్పీడ్ బ్రేకర్లు లేక నిత్యం వాహనదారులు ప్రమాదాలకు గురి అవుతున్న కూడా ఎన్ హెచ్ ఎ ఐ అధికారులు పట్టించుకోవడం లేదు గత ఐదు నెలల క్రితం ఇదే ప్రాంతంలో ఎన్నో ప్రమాదాలు జరిగినాయి ఇదే ప్రాంతంలో ఆటో మరియు బస్సు ఢీకొని ఏడు మంది ప్రాణాలు పోయినా కూడా అధికారులకు ఎలాంటి చీమకుట్టినట్టు కూడా లేదు ముఖ్యంగా సూర్యాపేట నుండి ఖమ్మం వెళ్లే రహదారిలో ఏ ఒక్క ఫ్లై ఓవర్ పక్కన గాని గ్రామాల్లో గాని స్పీడ్ బ్రేకర్లు లేక నిత్యం ప్రమాదాలకు గురి అయ్యి ప్రాణాలు పోతున్న కూడా సంబంధిత అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు తప్ప సమస్య పరిష్కారం మార్గాన్ని చూపట్లేదు ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవచూపి ఫ్లైఓవర్ పక్కన స్పీడ్ బ్రేకర్లు వేసి ప్రమాదాలను అరికట్టాలని ఈ ప్రాంత ప్రజలు అధికారులను కోరుతున్నారు