schedule Monday, August 24, 2026

ప్రజావాణికి 94 దరఖాస్తులు...

calendar_today December 23, 2024
person meenewstelugu
ప్రజావాణికి 94 దరఖాస్తులు...
  ప్రజావాణికి 94 దరఖాస్తులు...

ప్రజావాణి విన్నపాలను వెంటనే పరిష్కరించాలి.....

 జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్

 

 మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 23::: సూర్యాపేట కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి వచ్చి అందించిన ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ డి రాంబాబుతో కలిసి స్వీకరించారు. ఈరోజు ప్రజావాణిలో మొత్తం 94 దరఖాస్తులు రాగా శాఖ లవారీగా దరఖాస్తులను అధికారులకు పంపించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రయాణి కార్యక్రమంలో ప్రజలు చేసుకున్న దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిశీలించి తమ పరిధిలో ఉంటే వెంటనే పరిష్కరించాలని లేనిపక్షంలో వారికి తగు వివరణ ఇవ్వాల్సిందిగా అధికారులకు సూచించారు . త్వరలో రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపు కొరకు జనవరి లో డ్రా తీయటానికి అధికారులు తమ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఫిబ్రవరి నెలలో జరిగే పెద్దగట్టు జాతరకు సంబంధిత శాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేయాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు కొన్ని శాఖలకు చెందిన అధికారులు తమ నివేదికను అందజేయలేదని రేపటికల్లా పూర్తి నివేదికను అందజేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు సకాలంలో హాజరు కావాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ సతీష్ కుమార్, డి ఆర్ డి ఓ అప్పారావు, dtdo శంకర్, సి పి ఓ ఎల్ కిషన్, వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్ నాయక్ ,పశుసంవర్ధక శాఖ అధికారి శ్రీనివాస్ ,డి ఈ ఓ అశోక్, డి డబ్ల్యు ఓ నరసింహారావు, కలెక్టరేట్ ఏవో సుదర్శన్ రెడ్డి అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

.