schedule Tuesday, August 25, 2026

శాంతి, సామరస్యాలకు ప్రతీక క్రిస్మస్..

calendar_today December 25, 2024
person meenewstelugu
శాంతి, సామరస్యాలకు ప్రతీక క్రిస్మస్..

శాంతి, సామరస్యాలకు ప్రతీక క్రిస్మస్..

క్రీస్తు బోధనలు మానవాళికి ఆచరనీయం

ప్రజలందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు..

మాజీమంత్రివర్యులు, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి..

 మీ న్యూస్ ప్రతినిధి,:: శాంతి, సామరస్యాలకు ప్రతీకగా జరుపుకునే క్రీస్తు జననం పండుగ క్రిస్మస్ అని మాజీమంత్రివర్యులు, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ఈసందర్బంగా అయన ప్రజలందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో క్రీస్తు బోధనలు మానవాళికి ఆచరనీయమని.. ఏసుప్రభువు జీవనం అందరికీ ఆదర్శప్రాయమన్నారు. అయన బోధనల ద్వారా మానవాళి సన్మార్గం వైపు నడవాలన్నారు. నిస్సహాయులపై కరుణ, సాటివారిపై ప్రేమ, క్షమా, సహనం, దాతృత్వం, త్యాగం.. ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలన్నారు. ఎల్లప్పుడూ ఆ కరుణామయుని ఆశీస్సులు, దీవెనలు ప్రజలకు ఉండాలని కోరుతూ ప్రశాంతవతావరణంలో పండుగ వేడుకలు జరుపుకోవాలన్నారు.