schedule Saturday, June 13, 2026

జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు కన్వీనర్ కందుకూరిను రాజ్ కుమార్ను  ఘనంగా సత్కరించిన్న ఆర్ కృష్ణయ్య

calendar_today December 30, 2024
person meenewstelugu

జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు కన్వీనర్ కందుకూరిను రాజ్ కుమార్ను  ఘనంగా సత్కరించిన్న ఆర్ కృష్ణయ్య

గ్రామ పట్టణాల స్థాయి నుండి బీసీల ఉద్యమాన్ని బలోపేతం చేయాలి

రాష్ట్ర నాయకత్వం జిల్లాల్లో పర్యటించాలి

అవగాహన సదస్సులు నిర్వహించాలి

ఐదు దశాబ్దాలుగా ఆర్ కృష్ణయ్య చేసిన ఉద్యమాలని ప్రజలకు వివరించాలి

 -బిసి రాష్ట్రస్థాయి విస్తృత సమావేశంలో రాజ్ కుమార్

 

 తాండూర్ టౌన్ మీ న్యూస్ ప్రతినిధి ::: తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఏర్పడి నేటికీ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ హోటల్ అభినందన్ గ్రాండ్ లో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ అధ్యక్షతన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాట చేశారు ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్య నాయకులు వివిధ జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు ఈ సమావేశానికి వికారాబాద్ జిల్లా నుండి జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు తాండూర్ నియోజకవర్గ కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి పాల్గొన్నారు విద్యార్థి దశ నుండి రాజ్ కుమార్ బీసీ సంఘంలో చురుకుగా పాల్గొంటున్నందుకు వారిని ఆర్ కృష్ణయ్య ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ బీసీల నినాదం వాదం గ్రామస్థాయిలో వెళ్లాలంటే రాష్ట్రస్థాయి నాయకులు గ్రామాలలో పట్టణాలలో పర్యటించి బీసీలలో చైతన్యం తీసుకురావడానికి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని అదేవిధంగా గత ఐదు దశాబ్దాలు నుండి జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య చేస్తున్న ఉద్యమాలని ప్రజలకు వివరించే విధంగా జిల్లాస్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేయాలని రాజ్ కుమార్ కోరారు అన్నారు ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ విద్యార్థి సంఘం అధ్యక్షులు రామకృష్ణ యువజన సంఘం అధ్యక్షులు అంజి బీసీ సేన సంఘం నేత ఉదయ్ అనంతయ్య మరియు వివిధ జిల్లాల బీసీ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు